జన గళం ఎన్నికల డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ అధిష్టానం కసరత్తును మరింత ముమ్మరం చేసింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పోటీకి సిద్ధపడుతున్న నాయకులు, జనసైనికులు, వీరమహిళల నుంచి బయోడేటా దరఖాస్తులను స్వీకరించేందుకు అధికారిక ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది.
మేయర్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులుగా బరిలోకి దిగాలని భావించే పార్టీ శ్రేణులు వెంటనే తమ వివరాలతో కూడిన బయోడేటాను jsplocalbodyelections.com వెబ్సైట్ ద్వారా సమర్పించాలని అధిష్టానం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఈరోజు మధ్యాహ్నం 3:00 గంటలలోపే తమ దరఖాస్తులను ఆన్లైన్లో తప్పనిసరిగా పూర్తి చేయాలని సమయ పరిమితి విధించింది. ప్రజల్లో సేవా దృక్పథం, క్షేత్రస్థాయిలో పట్టున్న కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.
