సర్పంచ్‌గా సతీమణి తుమ్మల వెంకటలక్ష్మికి మద్దతు కోరిన నేత!
రాయవరం/రాజంపేట: కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం, టి.సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలో స్థానిక పంచాయతీ సమరంలో సరికొత్త రాజకీయ ఒరవడి తెరపైకి వచ్చింది. తమ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మచ్చా లక్ష్మీనారాయణ గారు కీలక ప్రకటన చేశారు. తన సతీమణి శ్రీమతి తుమ్మల వెంకటలక్ష్మి గారిని గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే, గ్రామాభివృద్ధి పనుల కోసం సొంతంగా రూ.70 లక్షల నిధులను విరాళంగా అందజేస్తానని వెల్లడించారు.
గతంలో నాలుగు పర్యాయాలుగా, దాదాపు 20 ఏళ్ల పాటు సర్పంచ్ పదవికి పోటీ చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. గెలుపోటములకు అతీతంగా గ్రామ సమగ్ర అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నిస్వార్థంగా గ్రామానికి సేవ చేయాలన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన పెద్ద కుమారుడు దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తి చేయగా, రెండో కుమారుడు అన్నపూర్ణ స్టూడియోలో నటనలో శిక్షణ పొందుతున్నారని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా గ్రామ ప్రగతి కోసమే ఈ ముందడుగు వేస్తున్నట్లు వివరించారు. గ్రామస్తులందరూ ఏకతాటిపై నిలిచి తన సతీమణిని ఏకగ్రీవంగా ఆశీర్వదిస్తే గ్రామాన్ని రూపురేఖలు మారుస్తానని భరోసా ఇచ్చారు.
