బ్రేకింగ్ న్యూస్
విజయ డెయిరీ నూతన చైర్మన్‌గా డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధన రావు ఎన్నిక: హర్షం వ్యక్తం చేసిన దాసరి జైరమేష్.. పాడి రైతులు, ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు!బాలయ్య–గోపీచంద్ మలినేని క్రేజీ కాంబోలో ‘ఎన్‌బీకే 111’: వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీష్ భారీ నిర్మాణం.. మరోసారి అలరించనున్న బాలయ్య–కాజల్ జోడీ!​శ్రీ విజయ గణపతి నవరాత్రోత్సవాలకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఆహ్వానం: ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ ప్రతినిధి కొట్టె వెంకటరావుహఫీజ్‌పేటలో మహిళపై హోంగార్డు అరాచకం: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్.. నిందితుడు ఆనంద్ డిస్మిస్, అరెస్ట్ చేసి జైలుకు తరలింపుపిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల జాతర: సోమవారం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన.. భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుడీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలనవిజయ డెయిరీ నూతన చైర్మన్‌గా డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధన రావు ఎన్నిక: హర్షం వ్యక్తం చేసిన దాసరి జైరమేష్.. పాడి రైతులు, ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు!బాలయ్య–గోపీచంద్ మలినేని క్రేజీ కాంబోలో ‘ఎన్‌బీకే 111’: వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీష్ భారీ నిర్మాణం.. మరోసారి అలరించనున్న బాలయ్య–కాజల్ జోడీ!​శ్రీ విజయ గణపతి నవరాత్రోత్సవాలకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఆహ్వానం: ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ ప్రతినిధి కొట్టె వెంకటరావుహఫీజ్‌పేటలో మహిళపై హోంగార్డు అరాచకం: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్.. నిందితుడు ఆనంద్ డిస్మిస్, అరెస్ట్ చేసి జైలుకు తరలింపుపిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల జాతర: సోమవారం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన.. భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుడీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలన
తెలంగాణ

హఫీజ్‌పేటలో మహిళపై హోంగార్డు అరాచకం: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్.. నిందితుడు ఆనంద్ డిస్మిస్, అరెస్ట్ చేసి జైలుకు తరలింపు

హఫీజ్‌పేటలో మహిళపై హోంగార్డు అరాచకం: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్.. నిందితుడు ఆనంద్ డిస్మిస్, అరెస్ట్ చేసి జైలుకు తరలింపు

​హైదరాబాద్, 2026 సెప్టెంబర్ 19, (జనగళం డెస్క్):

శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఓ హోంగార్డు నడిరోడ్డుపై ఒక మహిళ పట్ల కర్కశంగా, అమానుషంగా ప్రవర్తించిన దారుణ ఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. మహిళను విచక్షణారహితంగా కొడుతూ, జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుపోయిన హోంగార్డు ఆనంద్‌పై ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపారు. అతడిని తక్షణమే సర్వీసు నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేయడమే కాకుండా, క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

​వివరాలు ఇలా ఉన్నాయి, హైదరాబాద్ హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ భవనం వద్ద నిలబడి ఉన్న గుర్తుతెలియని మహిళ వద్దకు హోంగార్డు ఆనంద్ వచ్చాడు. ఎటువంటి ముందస్తు కారణం లేకుండానే ఆమెతో దురుసుగా ప్రవర్తించి తీవ్రస్థాయిలో కొట్టడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి జుట్టు పట్టుకుని బలవంతంగా లాగుతూ, రోడ్డుపై దారుణంగా ఈడ్చుకెళ్లాడు. ఈ అమానుష దృశ్యాలను అక్కడున్న స్థానికులు తమ సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. రక్షించాల్సిన రక్షకభట వ్యవస్థలోనే ఉన్న వ్యక్తి ఇలా మృగంలా ప్రవర్తించడంపై సర్వత్రా తీవ్రస్థాయిలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి.

Related News Desk దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలన

ఉన్నతాధికారుల సీరియస్ – కఠిన చర్యలు:

ఈ వీడియో దృశ్యాలు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో వారు తీవ్ర విస్మయం చెందారు. మహిళలపై దాడులకు పాల్పడేవారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ తక్షణ విచారణకు ఆదేశించారు. నిందితుడు హోంగార్డు ఆనంద్‌గా గుర్తించిన వెంటనే అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అతడిని హోంగార్డు విధుల నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆనంద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను వేధించే, దాడి చేసే అధికారులు, సిబ్బంది ఎవరైనా సరే చట్టపరంగా కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదని పోలీసు శాఖ ఈ సందర్భంగా హెచ్చరించింది.