జన గళం అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) అత్యంత కీలకమైన షెడ్యూల్ విధివిధానాలను వెల్లడించింది. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి కేవలం 14 రోజుల్లోనే మొత్తం పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారికంగా ప్రకటించారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగియనుందని, అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ మరియు పోలింగ్ ముగిసేలా ఏర్పాట్లు చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.
14 రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ప్రకటన!
