జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం అగినపర్రు గ్రామం శివారులోని బొడ్డువాని గూడెంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పీఎంఏజీవై (PMAGY) నిధుల నుంచి రూ. 20 లక్షల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు పామర్రు శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు ముఖ్య అతిథిగా విచ్చేసి భూమిపూజ చేసి శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు తగిన వసతులు కల్పించడమే ధ్యేయంగా ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కేటాయించిన నిధులతో పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీల సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు బొడ్డువాని గూడెం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్నిస్తోందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Slug: pamidimukkala-mandal-aginparru-community-hall-bhoomi-pooja-varla-kumar-raja
