ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం కొత్తగా 1,10,903 దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ జిల్లాలో 58,722 మంది, కృష్ణా జిల్లాలో 52,181 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా విజయవాడ అర్బన్ పరిధిలో 18 వేలకు పైగా అర్జీలు నమోదు కాగా, తిరువూరులో అత్యల్పంగా 944 దరఖాస్తులు అందాయి. శుక్రవారంతో గడువు ముగియడంతో శనివారం నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభం కానుందని, నెలాఖరు నాటికి అర్హుల తుది జాబితా విడుదలవుతుందని అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం పోటెత్తిన దరఖాస్తులు: మొత్తం 1.10 లక్షల అర్జీలు
Slug: combined-krishna-district-ntr-bharosa-pension-applications-verification-beneficiaries-list
