గుడివాడ టిడ్కో కాలనీ వాసుల ఏళ్లనాటి రవాణా సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. గుడివాడ పట్టణం – టిడ్కో కాలనీ మధ్య నడిచే ప్రత్యేక ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసును శనివారం ఉదయం స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానికులతో కలిసి డిపో వరకు బస్సులో ప్రయాణించి, మహిళలకు జీరో ఫెయిర్ టికెట్లను పంపిణీ చేశారు. కాలనీ ఏర్పడిన తర్వాత తొలిసారి బస్సు సౌకర్యం కలగడంపై స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళల పట్ల ఆర్టీసీ సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
గుడివాడ టిడ్కో కాలనీ వాసుల రవాణా కష్టాలకు చెక్: ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Slug: gudiwada-tidco-colony-special-apsrtc-bus-service-launched-mla-venigandla-ramu
