బ్రేకింగ్ న్యూస్
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్వసభ్య భేటీ.. రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాల స్వీకరణజనసేన కార్యాలయానికి పల్లా, నిమ్మల: పవన్ కల్యాణ్‌తో మున్సిపల్ సీట్ల సర్దుబాటుపై కీలక భేటీఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పెనమలూరు జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తలుజనసేన స్థానిక ఎన్నికల దరఖాస్తు పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. నేడు దరఖాస్తులు చేయవద్దని విజ్ఞప్తితిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనప్రపంచ కాపులను ఏకం చేసిన శివ భాస్కర్ పెద్దిరెడ్డికి పాలంకి రామారావు జన్మదిన శుభాకాంక్షలుఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్వసభ్య భేటీ.. రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాల స్వీకరణజనసేన కార్యాలయానికి పల్లా, నిమ్మల: పవన్ కల్యాణ్‌తో మున్సిపల్ సీట్ల సర్దుబాటుపై కీలక భేటీఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పెనమలూరు జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తలుజనసేన స్థానిక ఎన్నికల దరఖాస్తు పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. నేడు దరఖాస్తులు చేయవద్దని విజ్ఞప్తితిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనప్రపంచ కాపులను ఏకం చేసిన శివ భాస్కర్ పెద్దిరెడ్డికి పాలంకి రామారావు జన్మదిన శుభాకాంక్షలు
అమరావతి

74 ఏళ్ల వయసులోనూ టెన్నిస్‌ శిక్షణలో దుర్గకుమార్‌.. జాతీయ స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి

Slug: dr-singamsetti-durga-kumar-tennis-coaching-andhra-pradesh-sgfi
74 ఏళ్ల వయసులోనూ టెన్నిస్‌ శిక్షణలో దుర్గకుమార్‌.. జాతీయ స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి

జన గళం క్రీడా డెస్క్: వయసు మీదపడుతున్నా క్రీడలపై ఆయనకున్న ఆసక్తి తగ్గలేదు. 74 ఏళ్ల వయసులోనూ యువ క్రీడాకారులకు టెన్నిస్‌లో శిక్షణ అందిస్తూ వారి విజయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు డా. సింగంశెట్టి దుర్గకుమార్‌. ఆయన శిక్షణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారిణి తలశిల లలిత జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య కోచ్‌గా, సీనియర్‌ జర్నలిస్టుగా, ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ మాజీ ప్రధాన కన్వీనర్‌గా డా. దుర్గకుమార్‌ క్రీడారంగానికి విశేష సేవలందించారు. టెన్నిస్‌ శిక్షణను మరింత సులభతరం చేసేందుకు బంతులను సేకరించే పరికరం, బంతులను విసిరే యంత్రం వంటి వినూత్న సాధనాలను రూపొందించారు. టెన్నిస్‌ ఆటను సామాన్యులకు, యువ క్రీడాకారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో తెలుగులో ‘హౌ టు ప్లే టెన్నిస్‌’ అనే మార్గదర్శక పుస్తకాన్ని రచించారు. వ్యక్తిగతంగా అత్యధిక టెన్నిస్‌ టోర్నమెంట్లు నిర్వహించిన ఘనత కూడా ఆయనకు ఉంది.

Related News Desk జనసేన కార్యాలయానికి పల్లా, నిమ్మల: పవన్ కల్యాణ్‌తో మున్సిపల్ సీట్ల సర్దుబాటుపై కీలక భేటీ

దుర్గకుమార్‌ శిక్షణలో తలశిల లలిత అండర్‌-17 విభాగంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఎంపికైంది. అలాగే పి.వి. సుక్తి శ్రీ, పి. లాస్య ప్రియ అండర్‌-14 ప్రాంతీయ టెన్నిస్‌ టోర్నమెంట్లలో వరుసగా మొదటి, రెండో స్థానాలు సాధించారు. యువ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో దుర్గకుమార్‌ శిక్షణ కీలకంగా నిలుస్తోంది.

అక్టోబర్‌ 23 నుంచి 28 వరకు న్యూఢిల్లీలో జరగనున్న స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ పోటీల్లో పాల్గొననున్న తలశిల లలితకు నరసరావుపేటకు చెందిన డా. పి. శ్రీనివాస్‌ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గకుమార్‌ కృషిని అభినందిస్తూ, యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.