జన గళం : సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కాపు సమాజం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ప్రముఖ సామాజిక నేత శివ భాస్కర్ పెద్దిరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పాలంకి రామారావు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ ఉన్నతికి, ఐక్యతకు నిరంతరం పాటుపడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలను అనుసంధానించడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కాపు బంధువులందరి మధ్య సమన్వయం, సోదరభావం పెంపొందించేందుకు శివ భాస్కర్ పెద్దిరెడ్డి చేసిన సేవలు ప్రశంసనీయమని పాలంకి రామారావు కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఆయన సమాజ సేవలో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని, ఆయన నాయకత్వం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ శుభదినాన శివ భాస్కర్ పెద్దిరెడ్డి ఆయురారోగ్యాలతో, సకల సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పాలంకి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులు సైతం పెద్ద ఎత్తున శివ భాస్కర్ పెద్దిరెడ్డికి తమ జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలు అందజేస్తున్నారు.
