జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జనసేన కార్యకర్త కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ఐదో వార్డుకు చెందిన జువ్వాది తారక రామ పెద్దిరాజు బైపాస్ రోడ్డులో గౌతమ్ పాఠశాల సమీపంలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స నిమిత్తం భారీగా ఖర్చవుతున్న విషయాన్ని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సందు పవన్ స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫార్సు చేసి మూడు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ చెక్కును మంజూరు చేయించారు.
ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్వయంగా బాధితుడి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల చెక్కును అందజేశారు. పేద కుటుంబాలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందేలా చొరవ చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు జనసేన సమన్వయకర్త సందు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అర్జ కృష్ణ, గడ్డం శ్రీనివాసరావు, బురిడీ శాంతి నాయుడు, షేక్ రబ్బాని తదితరులు పాల్గొన్నారు.
