జన గళం భక్తి డెస్క్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ లంకమ్మ తల్లి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా పది రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం ఐదు గంటలకు ఆలయ ప్రాంగణంలో సామూహిక శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ పారాయణ మహాయజ్ఞంలో పాల్గొనడం ద్వారా అమ్మవారి కృపాకటాక్షాలతో పాటు సకల శుభాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం జరిగే లలితా సహస్రనామ పారాయణకు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ వర్గాలు కోరాయి.
