జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నున్న మండల కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, గుడివాడ సీనియర్ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలకు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో మాట్లాడిన కొడాలి నాని, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం మరియు నున్న పరిసర ప్రాంతాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
