జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్నికల సీట్లు మరియు రాజకీయ పదవుల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కులాల పేరిట దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. రానున్న స్థానిక సంస్థల సమరంలో స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా కుల ధ్రువీకరణ పత్రాలను తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారనే ఆరోపణలను లేవనెత్తింది.
కరజాడ వెంకట నాగ శశికళ అనే మహిళా నాయకురాలు 2018లో తీసుకున్న అధికారిక కుల ధ్రువీకరణ పత్రంలో ‘మాల’ (ఎస్సీ)గా ఉన్నారని, అదే వ్యక్తి 2026 అక్టోబర్ నాటికి అకస్మాత్తుగా ‘కాపు’గా ఎలా మారిపోయారంటూ సాక్ష్యాలతో కూడిన ప్రశ్నలను సంధించింది. రాజకీయ అవసరాలకు తగినట్లుగా కులాలను మార్చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, సీట్ల దక్కించుకునేందుకు కులాల గుర్తింపును మార్చుకోవడం అనైతిక రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తింది. 2018లో మాలగా నమోదైన వ్యక్తి 2026 నాటికి కాపు ఎలా అయ్యారో ప్రజలకు చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది.
