జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ నాయకులు, చిరంజీవి యువత ముఖ్య ప్రతినిధి శ్రీ పసుపులేటి శ్రీధర్ గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు శ్రీ ఇల్లూరి సుగుణబాబు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సుగుణబాబు మాట్లాడుతూ.. సమాజ హితమే ధ్యేయంగా, జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాక్షేత్రంలో నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు పసుపులేటి శ్రీధర్ అని కొనియాడారు. “జనసేనతో… ప్రజలతో… ప్రజల కోసం…” అనే నినాదంతో సాగుతున్న ఆయన ప్రయాణం మరింత దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భగవంతుని దివ్య ఆశీస్సులతో శ్రీధర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
