జన గళం విజయవాడ పశ్చిమ బ్యూరో: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి)ని వారి క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి అనూష సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో నెలకొన్న స్థానిక ప్రజా సమస్యలు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనపై వారు చర్చించారు. కూటమి భాగస్వామ్య స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయాలని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ భేటీలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Slug: janasena-leader-tirupati-anusha-suresh-meets-vijayawada-west-mla-sujana-chowdary
