జన గళం పెడన బ్యూరో: పెడన నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముమ్మరంగా పనులు చేపడుతోంది. స్థానిక శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారి ఆదేశానుసారం సోమవారం ఉదయం 9:30 గంటలకు నీలిపూడి నుంచి కోమాళ్ళపూడి వరకు నిర్మించనున్న ఆర్‌అండ్‌బీ (R&B) రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొమాళ్ళపూడి, నీలిపూడి గ్రామాల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తికావడం ద్వారా ఇరు గ్రామాల ప్రజలకు, రైతులకు రవాణా కష్టాలు తీరనున్నాయని నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లెనూ ప్రధాన రహదారులతో అనుసంధానించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిరంతరం శ్రమిస్తున్నారని కూటమి శ్రేణులు కొనియాడాయి.
ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో నీలిపూడి–కోమాళ్ళపూడి R&B రోడ్డు నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన!
Slug: mla-kagitha-krishna-prasad-orders-neelipudi-komallapudi-r-and-b-road-bhoomi-pooja
