జన గళం మంగళగిరి/అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సన్నద్ధత, సంస్థాగత బలోపేతం కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. విజయవాడ పార్లమెంట్ మినహా మిగిలిన అన్ని పార్లమెంట్ కమిటీలను ప్రకటించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి నుంచి వాస్తవ పరిస్థితులు, సమాచారాన్ని సేకరించాలని కమిటీలను ఆదేశించారు. ఈ కమిటీలన్నీ పవన్ కళ్యాణ్ స్వీయ పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. త్వరలోనే ప్రతీ పార్లమెంట్ కమిటీతో ఆయన స్వయంగా సమావేశమై ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు స్థానిక సమరం కోసం ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీ అనే మరో 4 కీలక కేంద్ర కమిటీలను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక సమరానికి జనసేన సై: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు!
Slug: pawan-kalyan-forms-adhoc-committees-ap-local-body-elections
