కరువు అనేది కేవలం గ్రామీణ ప్రాంతాలు లేదా రైతులకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, పట్టణాలు, నగరాల్లో నివసించే ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రభావితం చేస్తుందని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి ఇంటా నీటి వృథాను అరికట్టేందుకు తక్షణమే అమలు చేయదగిన ఆచరణాత్మక చిట్కాలను పంచుకుంటున్నారు:
- సగం గ్లాసు ఆతిథ్యం: అతిథులకు మొదట సగం గ్లాసు నీరు మాత్రమే అందించడం, అవసరమైతే అదనంగా ఇవ్వడం ద్వారా వందల లీటర్ల నీటి వృథాను అరికట్టడం.
- షవర్లకు స్వస్తి – బకెట్ స్నానం: షవర్లను పూర్తిగా పక్కనపెట్టి బకెట్, మగ్గుతో స్నానం చేయడం వల్ల ఒక్కో వ్యక్తి రోజుకు 30 నుంచి 40 లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు.
- ఆర్వో (RO) వ్యర్థ జలాల పునర్వినియోగం: ప్యూరిఫైయర్ల నుంచి బయటకు వచ్చే నీటిని వృథాగా పోనివ్వకుండా పాత్రలు, బట్టలు ఉతకడానికి, ఫ్లషింగ్‌కు వాడటం.
- బ్రష్, షేవింగ్ సమయంలో కుళాయిలు కట్టేయడం: కుళాయిలను నిరంతరం తిప్పి ఉంచకుండా అవసరమైనప్పుడు మాత్రమే వాడటం ద్వారా రోజూ 50 లీటర్ల దాకా ఆదా చేయడం.
- వాహనాల కడగడంపై నియంత్రణ: పైపులతో వాహనాలు కడగడం మాని, తడి గుడ్డతో డ్రై క్లీనింగ్ చేయడం.
- కిచెన్ వ్యర్థ జలాలు మొక్కలకు: కూరగాయలు, బియ్యం, పప్పులు కడిగిన నీటిని మొక్కల కుండీల్లో పోయడం ద్వారా అమూల్యమైన మంచినీటిని పొదుపు చేయడం.
- లీకేజీల తక్షణ మరమ్మతు: చుక్కలు కారే పైపులు, కుళాయిలను వెంటనే బాగు చేయించడం; ఫ్లష్ ట్యాంకుల్లో ఒక లీటరు నీటి బాటిల్‌ను ఉంచి ప్రతి ఫ్లష్కూ నీటి వినియోగాన్ని తగ్గించడం.
- వాషింగ్ మెషీన్ల వినియోగం: బట్టల పరిమాణానికి తగినంత నీటి మట్టాన్ని మాత్రమే ఎంచుకోవడం, రోజూ కాకుండా రోజు విడిచి రోజు పూర్తి లోడ్‌తో నడపడం.
నీటి పొదుపును ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, ఈ అలవాట్లను కుటుంబసభ్యులందరికీ అలవరిచి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
