జన గళం బిజినెస్ డెస్క్: మహిళా పారిశ్రామికవేత్తలు, యువ నిపుణులను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ‘సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (SCC) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ‘సమాఖ్య 2026 – గ్లోబల్ బిజినెస్ మీట్’ (SAMAKHYA 2026) సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ (హాల్ నెం. 4) లో ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, సరికొత్త నెట్‌వర్కింగ్ విస్తరణకు ఈ వేదిక దోహదపడనుంది.
ఈ సదస్సు సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల వృత్తి నిపుణులతో పాటు 30 ఏళ్ల లోపు యువ వ్యాపారవేత్తల కోసం నిర్వాహకులు ప్రత్యేక సభ్యత్వ నమోదును ప్రకటించారు. కేవలం రూ. 4,000 ప్రత్యేక రుసుముతో గ్లోబల్ బిజినెస్ డెలిగేట్ పాస్ అందుకోవడంతో పాటు, సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో అసోసియేట్ మెంబర్‌గా చేరే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నారు. ఆసక్తి గల మహిళలు, యువ నిపుణులు తక్షణమే క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అంతర్జాతీయ వేదికను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహక వర్గం పిలుపునిచ్చింది.
