కూటమి పాలనలో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, చంద్రబాబు కరువుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లాలో 48.2 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం మొద్దునిద్ర పోతోందని, మైలవరంలో 140 చెరువులకు గాను 90 ఎండిపోయినా పట్టించుకునే నాథుడే లేరని మండిపడ్డారు. డీఎస్సీ నిర్వహణలో రోజుకో కుంభకోణం బయటపడుతోందని, దీనిపై కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న విజయవాడ శాప్ కార్యాలయం ఎదుట నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు.
కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు: వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు
Slug: ysrcp-ntr-district-president-devineni-avinash-press-meet-drought-chandrababu-criticism-dsc-scam-protest
