విజయవాడ గాంధీనగర్‌లోని న్యూ ఇండియా హోటల్ సెంటర్ (హోటల్ ఐలాపురం ఎదురుగా) ప్రాంగణంలో శనివారం సాయంత్రం 6:00 గంటలకు గణనాథుని నిత్యార్చన అనంతరం ‘మహా సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ శాంతి హోమం’ వైభవంగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి – విశ్వహిందూ పరిషత్, మా ఆర్ట్స్ & మా మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ధార్మిక క్రతువును ఏర్పాటు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శాంతి హోమ పూజలను తిలకించి, తీర్థప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.
గాంధీనగర్‌లో నేడు ‘మహా సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ శాంతి హోమం’: గణేష్ ఉత్సవ సమితి, మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహణ
Slug: vijayawada-gandhinagar-sudarshana-lakshmi-narasimha-shanti-homam-ganesh-utsava-samithi-vhp
