జన గళం పల్నాడు డెస్క్: నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో పార్టీ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. చిలకలూరుపేటలోని శ్రీ పాదం గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల కమిటీకి చెందిన సయ్యద్ జిలాని, శివ పార్వతి, వంశీ, షేక్ సుభాని పాల్గొన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. స్థానిక స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధత, నాయకులు–కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.
జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. స్థానికంగా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ, ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పేర్కొన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యకలాపాలను మరింత సమన్వయంతో నిర్వహించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
