విజయవాడ: విజయవాడ నగర మేయర్‌గా నూతనంగా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు మరియు జనసేన పార్టీ తరఫున నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలిసి నేడు (సోమవారం, నవంబర్ 9) ప్రత్యేక ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది.
ఈ సందర్భంగా సాయంత్రం 4:00 గంటలకు భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుండి ఎస్ కన్వెన్షన్ హాల్ (S Convention Hall) వరకు భారీ ర్యాలీ నిర్వహించబడుతుంది. అనంతరం ఎస్ కన్వెన్షన్ హాల్‌లో అభినందన సభ, ఆత్మీయ సమావేశం కొనసాగుతుంది. ఈ చారిత్రక విజయ మహోత్సవంలో విజయవాడ నగరంలోని జనసేన పార్టీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు, వీర మహిళలు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది.
