విజయవాడ: చీకటిపై వెలుగు సాధించిన విజయానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దివ్య దీపాల పర్వదినం దీపావళి సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గ మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు గారు ప్రజలందరికీ, కూటమి నాయకులకు, జనసైనికులకు హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దీపాల పండుగ ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం, జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ గారి సిద్ధాంతాల స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, ప్రగతి నిరంతరం కొనసాగాలని పేర్కొన్నారు. పండుగ సంబరాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకోవాలని శ్రీ అమ్మిశెట్టి వాసు గారు కోరారు.
