అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన రాజకీయ చరిత్రలోనే అపూర్వమైన ప్రభంజనాన్ని సృష్టించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఏకంగా 75 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది.
డిప్యూటీ సీఎం, జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ గారి సమర్థ నాయకత్వం, కూటమి ఐక్యత, గ్రామస్థాయిలో జనసైనికుల నిర్విరామ కృషి ఈ చారిత్రక విజయానికి ప్రధాన కారణమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మడి గోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం సహా రాయలసీమ ప్రాంతాల్లోనూ జనసేన పార్టీ జడ్పీటీసీ స్థానాలను కొల్లగొట్టి గ్రామీణ ప్రాంతాల్లో తిరుగులేని ప్రజాదరణను నిరూపించుకుంది. ఈ మేరకు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మొత్తం 75 జడ్పీటీసీ స్థానాల అధికారిక జాబితా విడుదలైంది.
