జన గళం కృష్ణా డెస్క్: నాగాయలంక మండలం టీ. కొత్తపాలెం గ్రామానికి చెందిన లేబాక వెంకటేశ్వరరావు, దేవరకొండ రాధాకృష్ణ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్స అనంతరం ఇళ్ల వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు సోమవారం వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న విక్కుర్తి శ్రీనివాసరావు.. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం అనంతరం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం వెంకటేశ్వరరావు, రాధాకృష్ణలకు ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తన వంతు సహకారం అందిస్తూ అండగా ఉంటానని విక్కుర్తి శ్రీనివాసరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
