జన గళం బ్యూరో: దేశ సార్వభౌమాధికారం, భద్రత కోసం నిరంతరం ఆకాశాన పహారా కాస్తున్న భారత వాయుసేన (IAF) వీరులకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ రాష్ట్ర డైరెక్టర్స్, జనసేన పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పి. భవాని రవికుమార్ వాయుసేన దినోత్సవ (Indian Air Force Day) శుభాకాంక్షలు తెలియజేశారు. గగనతలంలో భారత కీర్తి పతాకను రెపరెపలాడిస్తూ శత్రుదుర్భేద్యంగా సరిహద్దులను కాపాడుతున్న వైమానిక యోధుల సేవలు అసమానమైనవని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా భవాని రవికుమార్ మాట్లాడుతూ.. దేశ రక్షణలో వైమానిక దళం ప్రదర్శించే ధైర్యసాహసాలు ప్రతి పౌరుడికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల వేళ కూడా ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడే వాయుసేన జవాన్లకు దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని అన్నారు. భారత గగనతల రక్షకులకు సెల్యూట్ చేస్తూ, జైహింద్ – జై భారత్ నినాదాలతో శుభాకాంక్షలు తెలిపారు.
