పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా కృత్తివెన్ను మండలం మునిపెడ గ్రామంలో రూ.14.5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గారు, ఎమ్ పి వల్లభనేని బాలశౌరి గారు, కృషితో ప్రధానమంత్రి మోడి గారు,ముఖ్యమంత్రి చంద్రబాబు గారు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కలయికలో పల్లె గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని
అన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, దశలవారీగా పూర్తి చేసేందుకు పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కూటమి నాయకులు తెలిపారు. ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడేలా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీనీటిసంఘం అధ్యక్షులు దాసరి ఆదినారాయణ, నీటి సంఘం అధ్యక్షులు తోట నాగబాబు,బిజెపి నాయకులు ఇల్లూరి సుబ్బారావు,తోట జయబాబు,కాకర బాలశౌరి,దాసరిపెద ఆదినారాయణ,గంటా బాలమురళి కృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు
Slug: mangalagiri-tdp-office-minister-lokesh-praja-darbar-grievances
