బ్రేకింగ్ న్యూస్
వడ్డేశ్వరం బైపాస్ వద్ద ‘శ్రీ అమ్మ వరాహి AIIMS ఆటో స్టాండ్’ ప్రారంభం: జెండా ఆవిష్కరించి ప్రారంభించిన APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు!పెడనలో వైఎస్సార్‌సీపీ సన్నాహక సమరం: రేపు కృత్తివెన్నులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం!ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో నీలిపూడి–కోమాళ్ళపూడి R&B రోడ్డు నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన!తూర్పుగోదావరి జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన: ఎడిద బాబి, మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అభిమానుల అపూర్వ స్వాగతం!మచిలీపట్నం పార్లమెంట్ స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ ప్రకటన: సమన్వయకర్తగా డాక్టర్ రాధిక మాధవికి కీలక బాధ్యత!విజయవాడ ఉత్సవ్ 2.0కు దళపతి జోరు: రేపు బెజవాడకు రానున్న తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్!మచిలీపట్నం పార్లమెంట్ జనసేన కమిటీ సభ్యుడిగా మదివాడ రాము నియామకం: అభినందించిన రాయగిరి శ్రీరామ్ మోహన్ రావుఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు దాదాపుగా ఖరారు: నేడే తుది జాబితా విడుదల!ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా నవరాత్రులు: రెండవ రోజు భక్తులకు ‘శ్రీ గాయత్రీ దేవి’గా దర్శనమిస్తున్న జగన్మాత!పెడనలో వైఎస్సార్‌సీపీ సన్నాహక సమరం: నేడు గూడూరులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం!వడ్డేశ్వరం బైపాస్ వద్ద ‘శ్రీ అమ్మ వరాహి AIIMS ఆటో స్టాండ్’ ప్రారంభం: జెండా ఆవిష్కరించి ప్రారంభించిన APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు!పెడనలో వైఎస్సార్‌సీపీ సన్నాహక సమరం: రేపు కృత్తివెన్నులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం!ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో నీలిపూడి–కోమాళ్ళపూడి R&B రోడ్డు నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన!తూర్పుగోదావరి జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన: ఎడిద బాబి, మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అభిమానుల అపూర్వ స్వాగతం!మచిలీపట్నం పార్లమెంట్ స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ ప్రకటన: సమన్వయకర్తగా డాక్టర్ రాధిక మాధవికి కీలక బాధ్యత!విజయవాడ ఉత్సవ్ 2.0కు దళపతి జోరు: రేపు బెజవాడకు రానున్న తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్!మచిలీపట్నం పార్లమెంట్ జనసేన కమిటీ సభ్యుడిగా మదివాడ రాము నియామకం: అభినందించిన రాయగిరి శ్రీరామ్ మోహన్ రావుఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు దాదాపుగా ఖరారు: నేడే తుది జాబితా విడుదల!ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా నవరాత్రులు: రెండవ రోజు భక్తులకు ‘శ్రీ గాయత్రీ దేవి’గా దర్శనమిస్తున్న జగన్మాత!పెడనలో వైఎస్సార్‌సీపీ సన్నాహక సమరం: నేడు గూడూరులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం!
ఆంధ్ర

తిరువూరులో ఘనంగా ముగిసిన ‘జయహో బీసీ’ 100 కి.మీ. బైక్ ర్యాలీ.. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల అమలే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

tiruvuru-kolikapudi-srinivasarao-jayaho-bc-bike-rally
తిరువూరులో ఘనంగా ముగిసిన ‘జయహో బీసీ’ 100 కి.మీ. బైక్ ర్యాలీ.. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల అమలే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలును ఆకాంక్షిస్తూ మరియు దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన “జయహో బీసీ” బైక్ ర్యాలీ నిర్వహించారు. కొండపర్వ నుంచి నెమలి వరకు సుమారు 100 కిలోమీటర్ల మేర సాగిన ఈ భారీ బైక్ ర్యాలీకి బీసీ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ ర్యాలీ ముగింపు సందర్భంగా నెమలి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఎన్డీఏ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లను తగ్గించడం వల్ల గ్రామస్థాయి పదవుల నుంచి మేయర్లు, జడ్పీ చైర్మన్ల వరకు సుమారు 16 వేల మంది బీసీలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని మండిపడ్డారు.

Related News Desk వడ్డేశ్వరం బైపాస్ వద్ద ‘శ్రీ అమ్మ వరాహి AIIMS ఆటో స్టాండ్’ ప్రారంభం: జెండా ఆవిష్కరించి ప్రారంభించిన APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు!

అంతేకాకుండా, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనను అడ్డుకునేలా వైఎస్సార్‌సీపీ న్యాయస్థానాలను ఆశ్రయించిందని, ఈ అంశం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. రేపో, మాపో దీనిపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు న్యాయం చేయడం, వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసమే చేపట్టిన ఈ 100 కిలోమీటర్ల “జయహో బీసీ” బైక్ ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో బీసీ సోదరులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

Slug: tiruvuru-kolikapudi-srinivasarao-jayaho-bc-bike-rally