జనగళం 24 ఆంధ్ర డెస్క్: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల కమిటీ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, ప్రజాబలంపై దృష్టి సారించిన కమిటీ, స్థానిక జనసైనికులను నేరుగా కలిసి వారి అభిప్రాయాలను నమోదు చేసుకుంది. వార్డులు, గ్రామాల వారీగా పార్టీ బలాబలాల సమాచారాన్ని సేకరించి ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు.
ఈ కీలక భేటీలో సమన్వయకర్తలు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, గుండ్లూరు నాగరత్నం, నున్నే మల్లికార్జున యాదవ్‌లతో పాటు సహాయక బృందం సభ్యులు గుణుకుల కిషోర్, షేక్ కరీం, దాడి అజయ్ కుమార్, పెంచల ప్రసాద్, దొరస్వామి, సాయి విఠల్, అల్లూరి రవీంద్ర పాల్గొన్నారు. క్షేత్రస్థాయి సమీక్షల అనంతరం కూటమి బలోపేతమే లక్ష్యంగా జిల్లా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయ సమావేశానికి తమ్మిరెడ్డి శివశంకర్ నేతృత్వంలోని బృందం హాజరై ఉమ్మడి ఎన్నికల వ్యూహాలపై చర్చించింది
