జనగళం 24 ఆంధ్ర డెస్క్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమన్వయ సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల శ్రేణులను ఏకం చేస్తూ అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలు నిర్ణయించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ నేతృత్వంలో సుజయ్ బాబు, నాగరత్నం, మల్లికార్జున యాదవ్ హాజరయ్యారు. జనసేన కేడర్‌తో, పార్లమెంటరీ కమిటీతో ముందస్తుగా సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం తమ్మిరెడ్డి శివశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి సురేష్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, రఘునాథరాజు హాజరై ఉమ్మడి ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.
Slug: nellore-nda-alliance-coordination-meeting-local-body-elections-tdp-office
