జనగళం 24 ఆంధ్ర డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి కూటమి శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. తాడేపల్లిలోని జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నివాసంలో కూటమి ముఖ్య నేతల సమన్వయ సమావేశం జరిగింది. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో రాబోయే ఎన్నికల కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కేడర్‌ను సమన్వయం చేసుకుని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ భేటీలో ఎంపీ పాక సత్యనారాయణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జనసేన సమన్వయ కమిటీ సభ్యులు చాగంటి మురళీకృష్ణ, చలమల చంద్రశేఖర్, గవర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Slug: tadepalli-nda-alliance-leaders-meeting-local-body-elections-west-godavari
