జన గళం విజయవాడ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైన వేళ, ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్ మొదటి రోజు ఉత్సవాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ దర్శనార్థం పోటెత్తిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆమె క్యూలైన్ల వద్ద ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు అధికారులు, ఆలయ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ భక్తులను ముందుకు సాగాల్సిందిగా సూచించారు. వృద్ధులు, మహిళలకు సులభతరంగా దర్శనం పూర్తయ్యేలా చూస్తూ సేవలందించారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శోభ: మొదటి రోజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించిన ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్!
Slug: padmavathi-thakur-durga-temple-trust-board-member-inspects-dasara-day-1-indrakeeladri
