జన గళం గుడివాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ సమాయత్తమవుతున్న క్రమంలో గుడివాడ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా యువ నాయకుడు సందు పవన్ నియమితులయ్యారు. పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తనపై పూర్తి విశ్వాసం ఉంచి గుడివాడ సమన్వయకర్తగా గురుతర బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సందు పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, గ్రామ వార్డు స్థాయిల్లో జనసేన బలోపేతానికి అంకితభావంతో శ్రమిస్తానని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. స్థానిక పోరులో కూటమి విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఏకం చేస్తానని పేర్కొన్నారు.
గుడివాడ అసెంబ్లీ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా సందు పవన్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు!
Slug: sandu-pawan-appointed-gudivada-janasena-local-body-elections-coordinator-thanks-pawan-kalyan
