జన గళం బందరు డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా సాగేందుకు, సకాలంలో చట్టపరమైన సహకారం అందించేందుకు జనసేన పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీ బసు నంచారయ్యను మచిలీపట్నం పార్లమెంట్ కమిటీకి అనుసంధానిస్తూ (అటాచ్ చేస్తూ) నిర్ణయం తీసుకున్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగానికి, నాయకులకు ఎప్పటికప్పుడు న్యాయపరమైన సలహాలు, తోడ్పాటు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. అవసరమైన సమన్వయం కోసం మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని నాయకులు, శ్రేణులు శ్రీ బసు నంచారయ్యను (సెల్ నెం: 9908409302) సంప్రదించవచ్చని జనసేన పార్టీ ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
