బ్రేకింగ్ న్యూస్
సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి అప్పగింత.. రూ. 25 లక్షల పరిహారానికి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!​నూజివీడులో ఆటోల ఆగడాలు: వన్‌వేలో ఎదురుదిశగా దూకుడు.. దసరా వేళ నిబంధనలు గాలికి!కలిదిండి జనసేనలో తీవ్ర అయోమయం: ఒకే సమయంలో రెండు కీలక సమావేశాలు.. కూటమి సమన్వయ లోపమా? జనసేనను విస్మరించే వ్యూహమా?టీడీపీ సీనియర్ నేత వలవల సత్యనారాయణకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘన నివాళి!తోటమూలలో స్థానిక సమరానికి జనసేన సైన్యం రెడీ.. విస్తృత సమావేశంలో సమన్వయకర్తల కీలక దిశానిర్దేశం!ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!తూర్పు గోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు: చైర్‌పర్సన్ రేసులో గంటా స్వరూపాదేవి.. అధినేత పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తుల వెల్లువ!సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి అప్పగింత.. రూ. 25 లక్షల పరిహారానికి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!​నూజివీడులో ఆటోల ఆగడాలు: వన్‌వేలో ఎదురుదిశగా దూకుడు.. దసరా వేళ నిబంధనలు గాలికి!కలిదిండి జనసేనలో తీవ్ర అయోమయం: ఒకే సమయంలో రెండు కీలక సమావేశాలు.. కూటమి సమన్వయ లోపమా? జనసేనను విస్మరించే వ్యూహమా?టీడీపీ సీనియర్ నేత వలవల సత్యనారాయణకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘన నివాళి!తోటమూలలో స్థానిక సమరానికి జనసేన సైన్యం రెడీ.. విస్తృత సమావేశంలో సమన్వయకర్తల కీలక దిశానిర్దేశం!ఎంపీ వల్లభనేని బాలశౌరితో పెనమలూరు జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై విస్తృత చర్చ!తూర్పు గోదావరి జడ్పీ పీఠంపై జనసేన కసరత్తు: చైర్‌పర్సన్ రేసులో గంటా స్వరూపాదేవి.. అధినేత పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తుల వెల్లువ!
రాజకీయం

స్థానిక సంస్థల సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ ఖరారు.. సీట్ల సర్దుబాటు పూర్తి: జనసేనకు 4 కార్పొరేషన్లు, 17 మున్సిపాలిటీలు!

స్థానిక సంస్థల సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ ఖరారు.. సీట్ల సర్దుబాటు పూర్తి: జనసేనకు 4 కార్పొరేషన్లు, 17 మున్సిపాలిటీలు!

విజయవాడ, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం జనసేనకు.. రాజమండ్రి బీజేపీ పరం

​జన గళం బ్యూరో, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం తుది దశకు చేరింది. మూడు పార్టీల మధ్య సఖ్యతను కాపాడుతూ, క్షేత్రస్థాయి బలాబలాలు, గత సాధారణ ఎన్నికల ఫలితాలను ప్రాతిపదికగా తీసుకుని మున్సిపల్ పీఠాల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదిరింది.

Related News Desk సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!

​ఈ ఒప్పందం ప్రకారం కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రతిష్ఠాత్మక మున్సిపల్ కార్పొరేషన్లు, 17 మున్సిపాలిటీలు దక్కాయి. రాజకీయంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ నగర కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని కాకినాడ, ఏలూరు మరియు ఉత్తరాంధ్ర కీలక కేంద్రమైన శ్రీకాకుళం నగరపాలక సంస్థల మేయర్ స్థానాలు జనసేనకు కేటాయించారు. మరో మిత్రపక్షమైన బీజేపీకి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీలను కేటాయించేలా అంగీకారం కుదిరింది. మిగిలిన అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో టీడీపీ నేతృత్వంలో కూటమి బరిలోకి దిగనుంది.

​పార్టీల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు తలెత్తకుండా సమష్టి నాయకత్వంతో ఎన్నికలను ఎదుర్కోవాలని కూటమి పెద్దలు దిశానిర్దేశం చేశారు. సీట్ల కేటాయింపు కొలిక్కి రావడంతో ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక కసరత్తును మరింత వేగవంతం చేయనున్నారు.