అమరావతి: చీకటిని తరిమికొట్టి వెలుగులను నింపే దివ్య దీపాల పర్వదినం దీపావళి సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు ప్రజలందరికీ, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని అంధకారాన్ని పారద్రోలి ప్రజలందరి జీవితాల్లో ఈ దీపావళి సరికొత్త కాంతులు, ఆశల వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ గారి సిద్ధాంతాల స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, ప్రగతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యం నిండాలని, పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో, పర్యావరణ హితంగా సురక్షితంగా జరుపుకోవాలని శ్రీ రామ్ తాళ్లూరి గారు ఆకాంక్షించారు.
