విజయవాడ: దివ్య దీపాల పర్వదినం దీపావళిని పురస్కరించుకుని విజయవాడ మాచవరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం ఛైర్మన్ శ్రీ సోడిశెట్టి కృష్ణప్రసాద్ గారు భక్తులకు, నగర ప్రజలకు హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ దాసాంజనేయ స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లోని అజ్ఞానం, చీకట్లు తొలగిపోయి ఆనందం, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. పవిత్రమైన ఈ దీపోత్సవ వేళ ప్రతి కుటుంబంలోనూ సౌభాగ్య వెలుగులు విరజిమ్మాలని, భక్తులందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని శ్రీ సోడిశెట్టి కృష్ణప్రసాద్ గారు ఆకాంక్షించారు.
