హైదరాబాద్: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో, ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘#ఇట్లుఅర్జున’ (#ItlluArjuna) మ్యూజికల్ కాన్సర్ట్ నేడు (నవంబర్ 9) నగరంలో అత్యంత వైభవంగా జరగనుంది.
ఈ సంగీత విభావరికి మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ప్రత్యేక ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ రోడ్డులో గల హైటెక్స్ (HITEX) హాల్-4 వేదికగా సాయంత్రం 5:00 గంటల నుంచి ఈ గ్రాండ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. అక్కినేని నాగార్జున, రామ్ చరణ్ ఒకే వేదికపై సందడి చేయనుండటంతో అక్కినేని, మెగా అభిమానుల్లో భారీ అంచనాలు, ఉత్సాహం నెలకొన్నాయి. ఈ కాన్సర్ట్‌కు సంబంధించిన ప్రవేశ పాస్‌ల వివరాలను నిర్వాహకులు ఇప్పటికే అందుబాటులో ఉంచారు.
