పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజిద్దాం: కరణం దివాకర్ బాబు, బాడిత శంకర్
- 47వ డివిజన్ జనసేన నాయకుడు ఎరుపల్లి కనకారావు ఆధ్వర్యంలో పంపిణీ
- ముఖ్య అతిథులుగా హాజరైన కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు, జోన్ కన్వీనర్ బాడిత శంకర్
విజయవాడ:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని చిట్టినగర్ సెంటర్‌లో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 47వ డివిజన్ జనసేన పార్టీ బీసీ నాయకుడు ఎరుపల్లి కనకారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కరణం దివాకర్ బాబు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ శ్రీ బాడిత శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై, స్థానిక ప్రజలకు మట్టి గణపతులను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పర్యావరణ హితమైన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అభినందనీయమని, ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన ఎరుపల్లి కనకారావును ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పొట్నూరి శంకర్, చలపాక సురేష్, పిల్లా సురేష్, పిల్లా నరేష్, దింది నాని, దాసిన జగదీష్, సమతం సత్తిబాబు, కోన రాకేష్, వీర మహిళ మరియు ఎస్టీ విభాగ నాయకురాలు ఆకారపు విజయకుమారి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
