జన గళం సినీ బ్యూరో: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, వినోదాత్మక చిత్రాల రూపకర్త మారుతి జన్మదినం సందర్భంగా అభిమానులు, సినీ శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మారుతికి కొండమూరి వీరబాబు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లూ మంచి ఆరోగ్యం, అంతులేని ఆనందం మరియు మరెన్నో విజయవంతమైన ప్రాజెక్ట్‌లతో సంతోషంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వెండితెరపై మాయాజాలాన్ని సృష్టిస్తూ ప్రేక్షకుల ముఖాల్లో ఎల్లప్పుడూ చిరునవ్వులు నింపాలని పేర్కొన్నారు.
Slug: kondamuri-veerababu-birthday-wishes-to-director-maruthi-the-raja-saab
