జన గళం డిజిటల్ బ్యూరో:
స్థానిక పోరులో చైర్మన్ సీట్లపై జనసేన కసరత్తు.. కూటమిలో సీట్ల కేటాయింపు చర్చలు.
- 25 ప్రధాన మున్సిపాలిటీలు: భీమవరం, పిఠాపురం, తెనాలి, తాడేపల్లిగూడెం, చీరాల, అమలాపురం, నర్సాపురం, తణుకు, అనకాపల్లి సహా 25 స్థానాలపై పట్టు.
- మార్కాపురంపై ప్రత్యేక దృష్టి: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన.
- ఎమ్మెల్యే స్థానాలే లక్ష్యం: జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు, బలమైన పట్టున్న పట్టణ ప్రాంతాలను కోరుతున్న నేతలు.
- కూటమి సమన్వయం: టీడీపీ నాయకత్వంతో సీట్ల పంపకంపై చర్చలు జరపనున్న జనసేన కేంద్ర సమన్వయ కమిటీ.
