జన గళం విజయవాడ బ్యూరో: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ (MSME) డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తమిరెడ్డి శివశంకర్ గారి జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా సోషల్ జస్టిస్ అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాకూర్ తమ గురుతుల్యులు తమిరెడ్డి శివశంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, పార్టీ పటిష్టత, పారిశ్రామిక అభివృద్ధి కోసం శివశంకర్ గారు చేస్తున్న నిరంతర కృషి యువ నాయకత్వానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లి, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అజయ్ వర్మ ఠాకూర్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
