- 2024 అసెంబ్లీ ఎన్నికల బలాబలాలు (ఫ్లాష్‌బ్యాక్)
2024 శాసనసభ ఎన్నికల్లో నగరంలోని మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తూ రికార్డు స్థాయి మెజారిటీలను సాధించింది.
2024లో నగరవ్యాప్తంగా కూటమికి ఏకంగా 1.65 లక్షల ఓట్ల భారీ ఆధిక్యం లభించింది.
వైఎస్సార్‌సీపీ బలమైన అభ్యర్థులను దింపినప్పటికీ అన్నిచోట్లా భారీ తేడాతో వెనుకబడింది.
- ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల తుది పోలింగ్ వివరాలు (01-11-2026)
మొత్తం నగర ఓటర్లు: 8,05,797
పోలైన మొత్తం ఓట్లు: 4,46,021
నగర సగటు పోలింగ్: 55.35%
నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం:
విజయవాడ సెంట్రల్ : 57.55% (నగరంలోనే అత్యధికం)
విజయవాడ వెస్ట్: 54.43% (55వ వార్డు పొడిగింపు తర్వాత పుంజుకున్న ఓటింగ్)
విజయవాడ ఈస్ట్: 53.95% (అత్యల్ప పోలింగ్)
3. క్షేత్రస్థాయి విశ్లేషణ & మేయర్ పీఠం సమీకరణాలు
4. పోలింగ్ తగ్గడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం?:
2024 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, ప్రస్తుత పురపాలక ఎన్నికల్లో 55.35 శాతానికే పరిమితమైంది. మొత్తం పోలైన ఓట్లు 4,46,021 మాత్రమే. 2024లో కూటమి ఒక్కటే నగరంలో 3.54 లక్షల ఓట్లు సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో కూటమి తన సంప్రదాయ, స్థానిక కేడర్ ఓట్లను బూత్‌లకు రప్పించడంలో పైచేయి సాధించిందా, లేక ఓటర్ల నిరాసక్తత వల్ల కూటమి ఓటు బ్యాంకు నష్టపోయిందా అనేది కీలకంగా మారింది.
సెంట్రల్‌లో పెరిగిన ఓటింగ్ (57.55%):
సెంట్రల్ నియోజకవర్గంలో 2024లో బోండా ఉమాకు భారీ ఆధిక్యం వచ్చింది. ఇప్పుడు కూడా నగరంలోనే అత్యధికంగా 57.55% ఓటింగ్ ఇక్కడే నమోదు కావడం కూటమికి అనుకూలాంశంగా భావిస్తున్నారు. ఇక్కడి డివిజన్లలో వచ్చే మెజారిటీ మేయర్ ఎన్నికలో నిర్ణయాత్మకంగా మారనుంది.
పశ్చిమలో ప్రతిష్టాత్మక పోరు (54.43%):
మైనారిటీ ఓటర్లు, కమర్షియల్ ఏరియాలు అధికంగా ఉండే వెస్ట్‌లో 54.43% నమోదైంది. 55వ డివిజన్ బ్యాలెట్ వివాదం, 42వ డివిజన్‌లో ఏజెంట్ల వివాదం వంటి ఉద్రిక్తతల నడుమ ఇక్కడ నమోదైన ఓటింగ్ ఫలితంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
తూర్పులో మందకొడి పోరు (53.95%):
గద్దె రామ్మోహన్‌కు కంచుకోటగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో పోలింగ్ 53.95 శాతానికే పరిమితం కావడం గమనార్హం. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల ఓటర్లు బూత్‌లకు రాకపోవడమే దీనికి ప్రధాన కారణం.
2024 నాటి భారీ ఆధిక్యాలు కూటమికి అండగా ఉన్నప్పటికీ, పోలింగ్ శాతం పడిపోవడం, స్థానిక డివిజన్ల వారీగా ఉండే అసంతృప్తులు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తాయనేది కౌంటింగ్ రోజున తేలనుంది.
విజయవాడ 3 నియోజకవర్గం కూటమి అభ్యర్థి & ఓట్లు YSRCP అభ్యర్థి & ఓట్లు వామపక్షాలు / కాంగ్రెస్ కూటమి మెజారిటీ.
*విజయవాడ పశ్చిమ* (West)
సుజనా చౌదరి (బీజేపీ): 1,05,669
షేక్ ఆసిఫ్: 58,637
జి. కోటేశ్వరరావు (CPI): 3,723+47,032
*విజయవాడ సెంట్రల్* (Central)
బోండా ఉమా (TDP): 1,30,034
వెల్లంపల్లి శ్రీనివాస్: 61,248
సి.హెచ్. బాబూరావు (CPM): 4,887+68,786
*విజయవాడ తూర్పు* (East)
గద్దె రామ్మోహన్ (TDP): 1,18,841
దేవినేని అవినాష్: 69,201-+49,640
నగరం మొత్తం ఓట్లు3,54,5441,89,0868,610+1,65,458
