జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని జనసేన పార్టీ సీనియర్ నాయకులు వై. శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా బస చేసిన చిరంజీవితో వై. శ్రీనివాస్ ఆత్మీయంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
చిరంజీవి అభిమానిగా, మూడు దశాబ్దాలకు పైగా ఆయన అభిమాన సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వై. శ్రీనివాస్ ప్రస్తుతం రాజమండ్రి పరిధిలో జనసేన పార్టీలో చురుగ్గా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనను ఆత్మీయంగా పలకరించి కుశలప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొన్న వేళ మెగాస్టార్తో జనసేన నాయకుడు భేటీ కావడం రాజకీయ వర్గాల్లోనూ, అభిమాన సంఘాల్లోనూ ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది.
