జన గళం కృత్తివెన్ను/పెడన డెస్క్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో భాగంగా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండలం చెరుకుమిల్లి ఎంపీటీసీ (MPTC) సెగ్మెంట్‌పై జనసేన పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, అనుసరించాల్సిన కార్యాచరణపై చెరుకుమిల్లి గ్రామ జనసేన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తలు శ్రీ అంక్యం లక్ష్మీ శ్రీనివాస్ గారు, శ్రీ లింగం నాగేశ్వరరావు గారు మరియు పార్లమెంట్ కమిటీ సభ్యులు శ్రీ సుగుణ బాబు ఇల్లూరి గారు పాల్గొని స్థానిక నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చెరుకుమిల్లి సెగ్మెంట్‌లో కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, పెడన ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లి ప్రజల సంపూర్ణ మద్దతు కూడగట్టాలని నేతలు నిర్ణయించారు.
