జన గళం ఎన్నికల డెస్క్: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయం కోసం నియమితులైన జనసేన పార్టీ సమన్వయకర్తలు ఇకపై ప్రతిరోజూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు అంకేం లక్ష్మీ శ్రీనివాస్, లింగం నాగేశ్వరరావు, వికృతి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను) గురువారం నుంచి రోజూ ఉదయం 10 గంటల నుంచి పెడన టౌన్ (తోటముల)లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉంటారని పార్టీ నాయకత్వం ప్రకటించింది.
పెడన నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలు, పెడన టౌన్కు చెందిన జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, స్థానిక ఎన్నికల కమిటీ సభ్యులు ఎన్నికల కార్యాచరణ, టిక్కెట్ల సమన్వయం, క్షేత్రస్థాయి వ్యూహాలకు సంబంధించిన అంశాలపై వీరిని నేరుగా కలిసి చర్చించవచ్చని పార్టీ వర్గాలు సూచించాయి. స్థానిక ఎన్నికల్లో కూటమి బలాన్ని చాటేలా సమష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Slug: pedana-janasena-local-election-coordinators-available-at-party-office
