జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: పేదల ఆశాజ్యోతి, దివంగత నేత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరడంపై కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సమక్షంలో రాధాకృష్ణ జనసేన కండువా కప్పుకున్న సందర్భంగా పెడన నియోజకవర్గ ‘టీమ్ బత్తిన’ జనసేన శ్రేణులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాయి.
ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ జనసేన నాయకులు మాట్లాడుతూ.. తమ ఆరాధ్యదైవం వంగవీటి మోహన రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న రాధాకృష్ణ జనసేన పార్టీలో భాగస్వామ్యం కావడం తమకు కొండంత బలాన్నిచ్చిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాధాకృష్ణ ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాబోయే స్థానిక సంస్థల సమరంలో పెడన నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా కూటమి, జనసేన పార్టీ అభ్యర్థుల భారీ విజయానికి ఐక్యంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
