జన గళం సినీ బ్యూరో/హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు మారుతి జన్మదినం సందర్భంగా మెగా బ్లడ్ బ్రదర్స్ ప్రతినిధి దుర్గారావు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తితో పనిచేస్తూ అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగా బ్లడ్ బ్రదర్స్ తరపున దుర్గారావు మారుతికి ప్రత్యేకంగా శుభాకాంక్షల సందేశాన్ని పంపారు.
ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ.. మన ప్రియతమ దర్శకుడు మారుతి అన్న రాబోయే కాలంలో మరిన్ని భారీ బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకోవాలని, జీవితంలో సదా ఆనందం, సంపూర్ణ ఆయురారోగ్యాలు, అఖండ విజయాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. వినోదాత్మక చిత్రాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమను ఉన్నత శిఖరాలకు చేర్చుతున్న మారుతి భవిష్యత్ ప్రాజెక్టులన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలని కోరారు.
