జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గుండు జితేంద్ర జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఈ ప్రత్యేక వేడుకకు జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సర్ధార్ సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా విచ్చేసి, స్వయంగా కేక్ కట్ చేసి జితేంద్రకు జన్మదిన హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిస్వార్థంగా శ్రమిస్తున్న సీనియర్ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కరణం దివాకర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని గుండు జితేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్ల అధ్యక్షులు పోలిశెట్టి శివ, కూరాకుల సురేష్, ప్రదీప్ రాజ్, రూట్ కోఆర్డినేటర్ భావిశెట్టి శ్రీను తదితరులు హాజరై తమ ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడంలో సీనియర్ నేతల పాత్ర ఎంతో కీలకమని నాయకులు కొనియాడారు.
ఈ జన్మదిన వేడుకల్లో సీనియర్ నాయకులు గుండాల నాని, గుండాపు అక్షయ్, ఎరుపల్లి కనకరావు, దుక్క సాంబ, ఉమ్మడిశెట్టి కృష్ణ, పోకల నాగబాబు, చలపాక సురేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని గుండు జితేంద్రకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకను విజయవంతం చేయడంతో పార్టీ కార్యాలయంలో కోలాహల వాతావరణం నెలకొంది.
Slug: vijayawada-west-janasena-gundu-jitendra-birthday-celebrations
